AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దుకూ అవకాశం: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కొందరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం కూడా లేకపోలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం తెలంగాణ అసెంబ్లీ గురువారానికి వాయిదా పడింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అసెంబ్లీలో తాను ఎక్కడా అసభ్యంగా, అన్ పార్లమెంటరీగా మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితకు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారని సీఎం తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి తన వ్యక్తిగత విషయాలను మాట్లాడినందుకే, తాను మిగతావి కూడా పూర్తి చేసినట్లు తెలిపారు.

సబితా ఇంద్రారెడ్డి మోసం అనే పదానికి భట్టి విక్రమార్క స్పష్టంగా సభలో చెప్పారన్నారు. ఆగస్టులో బెజవాడ జంక్షన్లోకి రాకుండా దారి మళ్ళించే రైళ్ళ పూర్తి జాబితా!! రేవంత్ వ్యాఖ్యలతో సబిత కంటతడి: ఎందుకమ్మా? అంటూ కాంగ్రెస్ కౌంటర్ సునీత లక్ష్మారెడ్డి కోసం 2018 ఎన్నికల ప్రచారానికి వెళితే తనపై రెండు కేసులు పెట్టారని కౌడిపల్లి, నర్సాపూర్‌​లో ఇప్పటికీ ఉన్నాయన్నారు. కానీ, సునీత లక్ష్మారెడ్డి అధికార పార్టీలోకి వెళితే తన కోసం ప్రచారం చేసిన తమ్ముడిపై కేసులు తీసేయాలని కోరకుండా మహిళ కమిషన్ పోస్టు తీసుకొని ఆ తర్వాత ఎమ్మెల్యే అయితే సరిపోతుందా? అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, అక్కల మాటలు నమ్మి మోసపోయానని కేటీఆర్‌కు చెప్పానన్న సీఎం రేవంత్.. సభలో ఎవరి పేరు ప్రస్తావించలేదని తెలిపారు. తనను కాంగ్రెస్​‌లోకి రమ్మని చెప్పిన సబితక్క అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారారన్నారు. తన ఎన్నిక బాధ్యత తీసుకుంటానన్న సబితక్క నామినేషన్ వేసేటప్పటికే వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు.

మోసానికి పర్యాయపదమే సబితా ఇంద్రారెడ్డి అని భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారన్నారు సీఎం రేవంత్. తనకు అన్యాయం జరిగిందంటూ సబితా ఇంద్రారెడ్డి ఇంత అవేదన చెందుతుంటే కేసీఆర్, హరీశ్ రావు ఎటుపోయారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి సబితక్కకు అండగా ఉండకుండా ఎందుకు డుమ్మాకొట్టారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎందుకు? అసెంబ్లీలో మాట్లాడేందుకు కేటీఆర్, హరీశ్ రావు చాలు అనుకుంటే కేసీఆర్‌ను ఎందుకు ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ ప్రశ్నించారు. అలాంటప్పుడు ఫ్లోర్ లీడర్‌​గా కేసీఆర్​‌ను తొలగించాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌​కు బాధ్యత రాష్ట్రం పట్ల పట్టింపు లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్‌​కు అధికారం లేకపోతే ప్రజల సమస్యలను పట్టించుకునే ఆలోచన ఉండదన్నారు.

అసెంబ్లీలో బహిష్కరణలు, సస్పెన్షన్లు, మార్షల్స్ అవసరం రావద్దని తమ ఆలోచనని.. అయితే అలాంటి అవసరం, సందర్భం వస్తే స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అవసరాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావొచ్చని సంచలన ప్రకటన చేశారు. గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు చేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. గతంలో తనను కూడా ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తే.. నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు రేవంత్ తెలిపారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌​లో చేరారన్న ప్రచారంపై స్పందించిన రేవంత్.. కలిసి టీ తాగేందుకు వెళ్లి ఉంటారని వ్యాఖ్యానించారు. కలిసి టీ తాగడానికి, పార్టీలో చేరడానికి సంబంధం ఉండదన్నారు. ఇటీవల 8, 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి తనతో టీ తాగారని అంత మాత్రాన వారందరూ కాంగ్రెస్‌‍​లో చేరినట్టా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.

ANN TOP 10