AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాళేశ్వరం వెళ్లి ఏం సాధించావ్ కేటీఆర్.. కేంద్రమంత్రి బండి సంజయ్

కాళేశ్వరంకు పోయిన వాళ్ళందరూ నాస్తికులే అని.. అందుకే గుడి యొక్క సాంప్రదాయాలను పాటించలేదని బీఆర్‌ఎస్ నేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… గర్భగుడి లోపలికి వెళ్లేముందు ఎలా ఉండాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలీదా అని ప్రశ్నించారు. గర్భగుడిలోకి వెళ్లే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లాలని గుడి వద్ద బోర్డు ఉంటుందన్నారు. దీన్ని ధిక్కరించి బీఆర్ఎస్ నేతలను గుడిలోకి వెళ్లారని విమర్శించారు. ‘‘టెంపుల్ ముందు బోర్డు కనపడలేదా..కళ్ళు దొబ్బినాయా కేటీఆర్’’ అంటూ మండిపడ్డారు.

అసలు కేసీఆర్ కొడుకు కేటీఆర్ దేవుడిని నమ్ముతారా.. ఆయన అతి పెద్ద నాస్తికుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. గుడికి వెళ్లిన వారిలో సంగం మంది నాస్తికులే కాబట్టి అక్కడి సాంప్రదాయాలను పాటించలేదని మండిపడ్డారు. ఇది పూర్తి హిందూ ధర్మాన్ని అవమానించినట్లే అని అన్నారు. తాము ఉన్నామని చెప్పుకోడానికి బీఆర్‌ఎస్ ఇన్ని పాట్లు పడుతోందన్నారు. కాళేశ్వరం సందర్శించి ఏం సాధించారని ప్రశ్నించారు. తప్పు జరలేదు అన్న విషయాన్ని కూడా చెప్పలేకపోయారన్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అక్కడకు వెళ్లి కేవలం దేవుడిని అవమానించడం తప్ప సాధించింది ఏమీ లేదన్నారు. హిందూ సమాజానికి బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కేటీఆర్ ఒప్పుకున్నట్టేనా?
ఎన్డీఎస్‌ఏకు పోలవరంపై లేని శ్రద్ధ కాళేశ్వరంపై ఎందుకన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బండి మండిపాడ్డారు. కాళేశ్వరంలో తప్పు జరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నట్టేనా అని ప్రశ్నించారు. పోలవరానికి కాళేశ్వరంకు లింక్ ఎందుకు అని అడిగారు. పోలవరంలో తప్పు జరిగితే.. ఫిర్యాదు చెయ్యి కేటీఆర్ అని అన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ లక్ష కోట్లు తిన్నారని దుయ్యబట్టారు. అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ కలిసినా ఆశ్చర్యపోనవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ గురించి ప్రజల్లో చర్చ లేదన్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్‌‌ను వీడుతున్నారన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఒక్కటయ్యారని… బీజేపీ ఎమ్మెల్యేలు హీరోలుగా ఫైట్ చేశారన్నారు. వికసిత్ భారత్ అజెండాగా నీగి ఆయోగ్ సమావేశం ఈరోజు జరగబోతోందని తెలిపారు.

కేటీఆర్ కు అహంకారం ఏమాత్రం తగ్గలేదన్నారు. ‘‘గతంలో షాడో సీఎంగా ఉన్న నువ్వు.. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేసినప్పుడు సిరిసిల్లలో టెక్స్‌టైల్ పార్క్‌ పెట్టాలని కేంద్రాన్ని గతంలో ఎందుకు అడగలేదు’’ అని ప్రశ్నించారు. నిన్నటి రాష్ట్ర బడ్జెట్‌లో సిరిసిల్ల రాష్ట్ర పరిశ్రమపై ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. తెలంగాణకు కేంద్రం ఎంతో చేసినప్పటికీ నిన్నటి అసెంబ్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమా?.. లేక కోట్లాటలా అని ప్రశ్నించారు. కేసీఆర్ పంధాన్నే నేడు కాంగ్రెస్ సర్కార్ పాటిస్తోందని విరుచుకుపడ్డారు.

ANN TOP 10