AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో పవన్‌ కల్యాణ్‌తో రేణు దేశాయ్‌ భేటీ!.. నెట్టింట వార్త హల్‌చల్‌

‘భగవద్గీత ఫౌండేషన్‌’పై మాట్లాడే అవకాశం
ఉబ్బితబ్బిబ్బవుతున్న ఫ్యాన్స్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో రేణు దేశాయ్‌ త్వరలో భేటీ అవుతున్నారన్న వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బద్రి, జానీ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా టైంలోనే ఇద్దరు ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకొని ఒకరి కొకరు దూరంగా ఉంటున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. రేణు దేశాయ్‌ మాత్రం తన పిల్లల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పర్సనల్‌ విషయాలు ఎన్నెనా ఉండని కానీ, ఫ్యాన్స్‌కు మాత్రం ఈ జంట ఎప్పుడు ఫేవరేటే, పర్సనల్‌ ఇష్యూస్తో విడిపోయిన వీరు కలిసి ఉంటే బాగుండేదనేది ఫ్యాన్స్‌ కోరిక. అయితే ఈ క్రమంలోనే వీరు మళ్లీ కలవబోతున్నారనే వార్త నెట్టింట హల్చల్‌ చేస్తుంది.

భగవద్గీత ఫౌండేషన్‌..
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్‌ ఫర్‌ వేదిక్‌ స్టడీస్‌కు చీఫ్‌ అడ్వైజర్‌ రేణు దేశాయ్‌ శుక్రవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారిని కలిశారు. ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్‌ మంత్రి సురేఖ గారికి వివరించారు. రేణుదేశాన్ని మంత్రి సురేఖ బట్టలు, బంగారు గొలుసు పెట్టి సతురించారు.

ఆనంను కలిసే అవకాశం..
ఈ క్రమంలోనే వచ్చే వారం ఆంధ్రప్రదేశ్‌ ఆనం రామనారాయణ రెడ్డిని కలిసే అవకాశమున్నట్లు.. అందులో భాగంగా భగవద్గీత ఫౌండేషన్‌ ఫర్‌ వేదిక్‌ స్టడీస్‌ గురించి ఆంధ్రాలోని పెద్ద వాళ్ళతో మాట్లాడే అవకాశాలున్నట్లు రేణు దేశాయ్‌ తెలిపారు. అదే విధంగా ఆనంతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కూడా కలిసి మాట్లాడే అవకాశాలున్నాయి. ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మికను కూడా పిల్లలు అలవరచుకోవాలనేది రేణుదేశాయ్, భగవద్గీత ఫౌండేషన్‌ ఫర్‌ వేదిక్‌ స్టడీస్‌ అభిప్రాయం. ఇలా అఫీషియల్‌గా పవన్‌ను రేణుదేశాయ్‌ కలుస్తున్నారని తెలుసుకున్న ఫ్యా¯Œ ్స ఫుల్‌ ఖుషీలో ఉన్నారు.

ANN TOP 10