భారత దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ అణు శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) కు జనం నివాళులు అర్పించారు. జూలై 27న (శనివారం) ఆయన వర్థంతిని పురస్కరించుకుని తమిళనాడులోని రామేశ్వరంలోగల అబ్దుల్ కలాం స్మారకాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు.
అబ్దుల్ కలాం బంధుమిత్రులు, అభిమానులు ఇవాళ ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఆయన స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. పుష్పాంజలి ఘటిస్తున్నారు. కాగా అబ్దుల్ కలాం 2015 జూలై 27న తన 83వ ఏట మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌లో గుండెపోటుతో మరణించారు.
షిల్లాంగ్‌లోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)’ లో ‘క్రియేటింగ్ ఎ లివెబుల్ ప్లానెట్ ఎర్త్’ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన కుప్పకూలారు. కేవలం ఐదు నిమిషాల ప్రసంగం తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చింది. కాగా, అబ్దుల్ కలాం 2022 నుంచి 2007 వరకు ఐదేళ్లు భారత రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించారు.









