AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

LCU లోకి AA 23 ఐకాన్ స్టార్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ అనగానే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ లోడింగ్ అనే సిగ్నల్స్ వచ్చేస్తాయి. అసలు సినిమా అనౌన్స్‌మెంట్ దాటి ముందడుగు పడకముందే, కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగకముందే ఈ రేంజ్ హైప్ రావడం కేవలం ఈ ఇద్దరి క్రేజ్ వల్లే సాధ్యమైంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ ఈ ప్రాజెక్ట్ గురించే కోడై కూస్తున్నాయి. రీసెంట్‌గా పుష్ప ది రూల్ చిత్రంతో సరికొత్త రికార్డులను వేటాడిన బన్నీ, లోకేశ్ కలసి ఒక విధ్వంసకరమైన కథను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేశారు.

 

జూన్ 25న ముంబై నగరంలో అల్లు అర్జున్ లుక్ టెస్ట్

సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లడానికి ముందే చిత్ర యూనిట్ అత్యంత కీలకమైన అడుగు వేయబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం హీరో మేకోవర్ మరియు లుక్ టెస్ట్‌కు సంబంధించిన ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. రాబోయే జూన్ 25న ముంబై నగరంలో అల్లు అర్జున్ లుక్ టెస్ట్ నిర్వహించేందుకు లోకేశ్ కనగరాజ్ అండ్ టీమ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సిరీస్‌లో రగ్గడ్ అండ్ మాస్ లుక్‌తో దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన బన్నీని, ఇప్పుడు లోకేశ్ సరికొత్త స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ అవతారంలో చూపించబోతున్నారట. ఈ సరికొత్త ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం అల్లు అర్జున్ కూడా ఇప్పటికే చాలా కసరత్తులు చేసినట్లు టాక్.

 

 

ప్రస్తుతం అల్లు అర్జున్ రాకా చిత్రంలో నటిస్తూ విపరీతమైన బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం గత కొన్ని రోజులుగా ఆయన ముంబైలోనే ఉంటున్నారు. ఈ గ్యాప్‌లోనే రాకా సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చి, లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ లుక్ టెస్ట్‌లో బన్నీ పాల్గొనబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇందుకోసం దర్శకుడు లోకేశ్ తన స్పెషల్ టీమ్‌తో కలసి ముంబైకి పయనం కావడం విశేషం. జూన్ 25న జరిగే ఈ ప్రయోగం తర్వాత హీరో క్యారెక్టర్ డిజైన్ మరియు కాస్ట్యూమ్స్ పై ఒక క్లారిటీ రానుంది.

 

బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తారో

 

మరోవైపు ఈ ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతున్న ఒక బిగ్గెస్ట్ సస్పెన్స్ ఏంటంటే, ఇది లోకేశ్ కనగరాజ్ సృష్టించిన క్రేజీ ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU) లో భాగం కాబోతుందా లేదా అనేది. ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలతో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద సినిమాటిక్ యూనివర్స్‌ను బిల్డ్ చేసిన లోకేశ్, ఇప్పుడు అల్లు అర్జున్‌ను కూడా ఆ గ్యాంగ్‌లోకి దించుతున్నారా అనే చర్చలు జోరందుకున్నాయి. ఒకవేళ బన్నీ గనుక ఎల్‌సియు లోకి ఎంటర్ అయితే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయారు బన్నీ ఫ్యాన్స్.

 

ప్రీ-ప్రొడక్షన్ పనులకే ఇంతలా టైమ్ కేటాయిస్తూ, ప్రతి చిన్న విషయాన్ని ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాకా ముగిసిన వెంటనే ఈ కాంబో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.చూడాలి మరి రెండు క్రియేటివ్ మైండ్స్ కలిసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తారో !

ANN TOP 10