AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ బడ్జెట్ @2.91 లక్షల కోట్లు

తెలంగాణ అసెంబ్లీలో 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం భట్టి ప్రవేశపెట్టారు. బడ్జెట్లో రూ.2,91,159 కేటాయిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా మూల ధన వ్యయం రూ.30,487 కోట్లుగా తెలిపారు. సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించారు. సాగునీటి రంగానికి రూ.26 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

* బడ్జెట్- రూ. 2,91,159 లక్షల కోట్లు
* రెవెన్యూ వ్యయం – రూ.2,20,945 కోట్లు
* మూలధనం వ్యయం – రూ.33,487 కోట్లు

వ్యవసాయానికి రూ.72,659 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు రూ.3050 కోట్లు, గృహ జ్యోతి పథకానికి రూ.2418 కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ. 10 వేల కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ రూ.1500కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ.1,525 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి రూ.9,200 I కోట్లు, వైద్యం, ఆరోగ్యం రూ.11,468 కోట్లు కేటాయించారు.

అసెంబ్లీకి హాజరైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రతిపక్షనేత హోదాలో ఇవాళ మొదటిసారి శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనారోగ్యానికి గురి కావడంతో ఆయన గత రెండు సమావేశాలకు హాజరు కాలేదు.

ANN TOP 10