AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీకి గులాబీ బాస్‌ కేసీఆర్‌.. ఆ హోదాలో తొలిసారి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన భట్టి

తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బడ్జెట్‌ 2024–25ను డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టారు. మరో వైపు ప్రతిపక్ష నేతగా, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తొలిసారి అసెంబ్లీకి వచ్చారు. పూలబొకే ఇచ్చి స్వాగతం పలికిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. కేసీఆర్‌ రాకతో సర్వత్రా ఆసక్తినెలకొంది.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2024–25ను ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో పద్దును ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌ సమావేశాలకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరు కావటం ఉత్కంఠ నెలకొంది. ఆయన హాజరవుతారా? లేదా? అనే టెన్షన్‌ నెలకొని ఉండగా.. దానికి తెరదించుతూ కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరయ్యారు. తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్‌ సభకు హాజరయ్యారు. కాగా, బడ్జెట్‌ ప్రసంగం అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు.

ANN TOP 10