AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిందితులను హాజరుపరచాల్సిందే.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

నాంపల్లి కోర్టు జడ్జి ఆదేశం
ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌ అరెస్టుకు అమెరికా వెళ్లనున్న దర్యాప్తు బృందం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులను హాజరు పరచాల్సిందేనంటూ నాంపల్లి కోర్టు జడ్జి ఆదేశించారు. ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఎస్బీఐ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, ఏ 6 నిందితుడు శ్రవణ్‌రావును న్యాయస్థానంలో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్‌ వర్చువల్‌గా న్యాయస్థానం ముందు హాజరవుతారని దర్యాప్తు బృందం తెలిపింది. అందుకు ససేమిరా అంది.

ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రధాని నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను నేరుగా హాజరు పరచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు అమెరికా వెళ్లనుంది దర్యాప్తు బృందం. ఇంటర్‌పోల్‌ ద్వారా ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను ఇండియాకు రప్పించేందు కు తెలంగాణ పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో ప్రభాకర్‌రావు ఉండే ప్రాంతాన్ని సిట్‌ గుర్తించినట్టు అంతర్గత సమాచారం. మరో నిందితుడు శ్రవణ్‌రావు ఆచూకీని సిట్‌ టీమ్‌ గుర్తించలేదు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వ్యవహారమంతా ఎస్‌బీఐ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు చుట్టూ తిరుగుతోంది. ఆయన ఆధ్వర్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని సిట్‌ టీమ్‌ ఓ అంచనాకు వచ్చింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత రెడ్‌ కార్నర్‌ నోటీసులు ఇష్యూ చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు రిమాండ్‌లో ఉన్నారు. వీరంతా పలుమార్లు దాఖలు చేసిన బెయిల్‌ పిటీషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది.

ANN TOP 10