AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో కొత్త పథకం.. రూ.లక్ష సాయం.. ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

‘రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం’
ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
నిరుద్యోగుల వల్లే తెలంగాణ ఆవిర్భావం
వారి బాధలు నాకు తెలుసు.. అండగా ఉంటా..
అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తా
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన అభ్యర్థులతో సీఎం సమావేశం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రజాభవన్‌లో సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో శనివారం రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. ‘రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన పేద అభ్యర్థులకు సర్కారు రూ.లక్ష ఆర్థిక సాయం అందించనుంది.

కీలక ప్రకటన..
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన రాష్ట్ర అభ్యర్థుల సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 30వేల ఉద్యోగాలు భారీ చేస్తామని అన్నారు. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీలోనూ మార్పులు చేపట్టామని చెప్పారు. ప్రతి ఏడాది డిసెంబర్‌ 9 వరకు ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగుల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. నిరుద్యోగుల బాధలు తమకు తెలుసని అన్నారు. నిరుద్యోగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్రూప్‌–2, 3 పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు.

ANN TOP 10