AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సూర్యాపేట జిల్లాలో విషాదం.. క్వారీ గుంతలో ఈతకు వెళ్లి ముగ్గురు మునక

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్వారీ గుంతలో పడి సాఫ్టువేర్ ఇంజినీర్ సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఆత్మకూరు (ఎస్) మండలం బొప్పారంలో చోటు చేసుకుంది. శ్రీపాల్ రెడ్డి, రాజు స్నేహితులు. వీరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్ కాగా, రాజు సాఫ్టువేర్ ఇంజినీర్. మంగళవారం ఓ విందులో పాల్గొన్నారు.

బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కూతురు క్వారీలో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో రాజు కూతురు క్వారీలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు శ్రీపాల్ రెడ్డి, రాజు అందులోకి దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ANN TOP 10