AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంద‌ని వాక‌బు చేశారు. కాగా, గత కొన్ని రోజులుగా సుధీర్‌ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్‌లో( AIG Hospital) చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బుధవారం కేటీఆర్‌ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిష్‌ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్, సుధీర్ రెడ్డి సతీమణి కమల తదితరులు ఉన్నారు.

ANN TOP 10