కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జన్మభూమి అయిన కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఆయనను ఆదివారం కరీంనగర్ లో కార్పొరేటర్లు సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ కు నిధులు తెచ్చే బాధ్యత తనదే అంటూ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని అద్దంలా తీర్చిదిద్దుతానంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక్కడి అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నేత గంగుల కమాలకర్ తో కూడా చర్చిస్తానంటూ చెప్పుకొచ్చారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో
తాను కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి స్థాయికి వచ్చానని అన్నారు. తాను బతికినన్నాళ్లు ఒకే పార్టీ, ఒకే సిద్ధాతంతో పనిచేస్తానన్నారు. ధర్మ రక్షణే ధ్యేయంగా, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తానని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అందుకోసం ఎందైకానా పోరాడతాని ఆయన పునరుద్ఘాటించారు. కరీంనగర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనులు చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు.
కేంద్రమంత్రిగా కరీంనగర్ కు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. పదవి ఉన్నా లేకున్నా మంచి పనులు చేస్తానని చెప్పారు. తాను వందేళ్లు బతకాలని కోరుకోవడంలేదని.. బతికినన్నాళ్లు ధైర్యంగా, నిజాయితీగా ఉండి పోరాడతానన్నారు. ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా పనిచేస్తానని అన్నారు. గతంలో గుండెపోటు రావడంతో ఎన్ని షాక్ లు ఇచ్చినా స్పృహ రాకపోవడంతో చనిపోయాని డాక్టర్లు ప్రకటించారని, కానీ, మహాశక్తి అమ్మవారి దయ వల్ల బతికానన్నారు. తనకు లభించిన ఈ పునర్జన్మను ప్రజలకే అంకితం చేస్తానంటూ సంజయ్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పదవిని బాధ్యతగా భావిస్తున్నానన్నారు.
‘భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద నా భార్యను చంపుతామన్నారు. కొడుకులను కిడ్నాప్ చేస్తామన్నారు. అయినా నేను ఏరోజు భయపడలేదు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధం. వెనుకాడే ప్రసక్తే లేదు. కేంద్ర హోంశాఖ నా పూర్వజన్మ సుకృతం. కేంద్రమంత్రిగా రాబోయే ఐదేళ్లపాటు అధిక నిధులు తీసుకువచ్చే అవకాశం వచ్చింది’ అంటూ కేంద్రమంత్రి పేర్కొన్నారు.