బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హైదరాబాద్‌కు ఏం చేసిందని అంటున్నారని.. ఔటర్ తెచ్చింది తామేనని, ఐటీ తెచ్చింది తామేనని, ఎయిర్ పోర్టు కట్టింది కూడా తామేనని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ చేసిందేంటంటే.. గంజాయి, డ్రగ్స్ తెచ్చారని రేవంత్ విమర్శించారు.
తాము ఏదో ఒకటి చేసుకుంటూ పోతుంటే.. కాళ్లల్లో కట్టె పెట్టే పనిలో బీఆర్ఎస్ వాళ్లు ఉన్నారని మండిపడ్డారు రేవంత్. వీళ్ల పని ఐపోయింది అన్నోడు ఎక్కడ ఉన్నాడు.. కనపడకుండా పోయాడని విమర్శించారు. రోజూ ఎవరున్నారు.. ఎవరు లేరు అని లెక్కపెట్టే పనిలో ఉన్నాడని బీఆర్ఎస్ నాయకత్వంపై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు.
ఈ ప్రభుత్వాన్ని కాపాడితే అభివృద్ధి జరుగుతుందని ప్రకాశ్ గౌడ్ లాంటి వాళ్లు కాంగ్రెస్‌లో చేరారని రేవంత్ చెప్పారు. రేవంత్ సర్కారు బలపడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అందరూ తమవైపు చూస్తున్నారన్నారు. పార్టీలోకి ఏమిస్తా.. నా దగ్గర ఏముందని.. నా అంగీ లాగు అమ్మినా పైసా రాదని రేవంత్ వ్యాఖ్యానించారు.
ప్రకాశ్ గౌడ్‌కి, ఎగ్గే మల్లేశంకి పైసలు తక్కువగా ఉన్నాయా?.. ఎగ్గే మల్లేశమే ప్రపంచ బ్యాంకుకి అప్పు ఇచ్చే స్థాయిలో ఉన్నారని రేవంత్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వాన్ని పడదోస్తామని ఇద్దరు అంబోతుల్లా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారని.. అయితే, ఎమ్మెల్యేలు మాత్రం నిలబడెతామని తమ దగ్గరికి వస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు.
ఎవరేమన్నా.. పదేళ్లు ఈ ప్రభుత్వాన్ని నిలబెడతామంటూ ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలోనేడో.. ఆరునెలల్లో తాము ఏం చేయలేదని మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీసినవాళ్లు.. ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణ ప్రజలపై మోపారన్నారు. వారు చేసిన అప్పులకు ప్రతి నెల రూ. 7వేల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. ఏడాదికి రూ. 72వేల కోట్లు వడ్డీకే సరిపోతోందన్నారు.
More From Oneindia