AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్రాండ్‌గా వరలక్ష్మి రిసెప్షన్‌.. కదిలివచ్చిన తారలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
స్టార్‌ యాక్టర్‌ శరత్‌ కుమార్‌ –నటి రాధిక దంపతుల కుమార్తె వరలక్ష్మి తన ప్రియుడితో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. వరలక్ష్మి నికోలయ్‌ సచ్‌దేవ్‌లు వివాహబంధంతో ఒక్కటయ్యారు. థాయ్‌లాండ్‌ వేదికగా జూలై 2న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తాజాగా చైన్నైలో బుధవారం రాత్రి గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.


ఈ వేడుకకు ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ నటీ నటులు వీరి రిసెప్షన్‌ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వరలక్ష్మి – నికోలయ్‌ రిసెప్షన్‌కు బాలయ్య బాబు, రోజా, మీనా, మంచు లక్ష్మీ, సందీప్‌ కిషన్‌ ఇలా చాలా మంది సెలెబ్రిటీలు మెరిశారు.

ANN TOP 10