AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్యే పార్టీ మారితే దూకేస్తా.. గద్వాల పట్టణంలో సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. వివరాలిలా ఉన్నాయి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది.. ఈ క్రమంలో నియోజకవర్గంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత అభిమానులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవొద్దంటూ ఆందోళన చేపట్టారు. సరితకు ఆ పార్టీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు.

జిల్లా కేంద్రంలోని నల్లగుంట ప్రాంతంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ అభిమాని ప్రసాద్‌ (25) ఏకంగా సెల్‌ టవర్‌ ఎక్కి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఒకవేళ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి పార్టీలో చేర్చుకుంటే టవర్‌ పైనుంచి దూకేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రసాద్‌ నచ్చజెప్పి కిందకు దింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భారీగా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ANN TOP 10