AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య

అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ పట్రపల్లెలో జరిగింది. సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ పట్రపల్లె గ్రామంలో రాణి అనే మహిళ హిమశ్రీ, జోష్మిత అనే ఇద్దరు తన కుమార్తెలతో కలసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఐదు సంవత్సరాల క్రితం రాయలపేటకు చెందిన దిలీప్‌ అనే వ్యక్తికి రాణిని ఇచ్చి వివాహం జరిపించారు.

అత్తమామల పోరు, మగ బిడ్డ కావాలన్న ఆశ, వేధింపు, అత్తింటివారు నిత్యం డబ్బులు డిమాండ్‌ చేయడం లాంటి వేధింపు చర్యల కారణంగా … తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి వెంకటరమణ తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. బావిలో నుండి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ANN TOP 10