AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవ్వడంతో జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. శనివారం ఉదయం కిడ్నీ సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను.. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తుండగా మృతి చెందారు. రమేష్ రాథోడ్ మృతదేహాన్ని ఉట్నూర్ కు తరలించారు.

ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ రమేష్ రాథోడ్.. తొలిసారి 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తరఫున ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2004 వరకూ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2006లో ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికై 2009 వరకూ బాధ్యతలు నిర్వహించారు. 2009లో 15వ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి.. గెలిచారు. ఆ తర్వాత అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. కొన్నినెలలకే ఆ పార్టీని వీడి.. కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2021లో కాంగ్రెస్ ను వీడి కమలం పార్టీలో చేరారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. కాగా.. రమేష్ రాథోడ్ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు.

ANN TOP 10