AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా.. కారణం అదే..!

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ప్రకారమైతే.. నేడు (జూన్ 28న) వరంగల్‌‌లో పర్యటించాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణ లాంటి కీలకమైన విషయాలతో అధిష్ఠానంతో చర్చిస్తోన్న రేవంత్ రెడ్డి.. నేడు కూడా పార్టీ పెద్దలతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. దీంతో.. వరంగల్ పర్యటన వాయిదా పడినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సహా.. పలువురు మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలపై భేటీ అవుతున్నారు. తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలతో పాటు.. పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే.. అటు పీసీసీ చీపీ, కేబినెట్ విస్తరణపై కూడా పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారు. కాగా.. పీసీసీ పదవి నుంచి తాను తన కర్తవ్యం నిర్వర్తించానని.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ ఉదయం మీడియా సమావేశంలో చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆ పదవి ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఎవరైతే సరిగ్గా సరిపోతారన్న అభిప్రాయాన్ని అధిష్ఠానంతో చెప్పినట్టు సమాచారం. తన పరిశీలనలో ఉన్న పలువురి పేర్లను అధిష్ఠానం ముందు ఉంచగా.. ఆ పేర్లపై పెద్దలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసమే.. రేవంత్ రెడ్డి రేపు కూడా అక్కడే ఉండాల్సివస్తోందని టాక్. అయితే.. నేడు కొత్త పీసీసీ పేరు ఖరారవుతుందా.. లేదా ఇంకా టైం పడుతుందా అన్నది సస్పెన్సే.

ANN TOP 10