తెలంగాణలోని మహిళలకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శక్తి క్యాంటీన్సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుతెలిపారు.
గ్రామైక్య సంఘాలకు ఈ క్యాంటీన్ల నిర్వహణ అప్పగిస్తామని సీఎస్ చెప్పారు. కలెక్టరేట్లు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని దీదీ కా రసోయ్, కేరళలోని క్యాంటీన్లపై ఇప్పటికే అధ్యయనం చేసినట్లు సీఎస్ తెలిపారు.
క్యాంటీన్ల నిర్వహణపై మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మహిళా శక్తి క్యాంటీన్సర్వీసులపై వివిధ శాఖల అధికారులతో సీఎస్శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. మహిళా శక్తి క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, అవసరమైన స్థలం తదితర వివరాలతో రోడ్ మ్యాప్ తయారు చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు.









