AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ అసెంబ్లీలో ఆటో మ్యుటేషన్ బిల్లు ఆమోదం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాల‌క శాస‌న‌ముల మూడ‌వ స‌వ‌ర‌ణ బిల్లుకు శాస‌న‌స‌భ‌ ఆమోదం తెలిపింది. ఆ బిల్లును స‌భ‌లో మంత్రి నారాయ‌ణ‌ ప్రవేశ పెట్టారు. బిల్లుపై స్వ‌ల్ప చ‌ర్చ త‌ర్వాత ఆమోదం తెలిపారు. ఆస్తుల ఆటోమ్యుటేష‌న్ అమ‌ల్లోకి వ‌చ్చేలా ఈ చ‌ట్టంలో ప్రభుత్వం స‌వ‌ర‌ణ‌లు చేసింది.

రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఆస్తుల రిజిస్ట్రేష‌న్ త‌ర్వాత య‌జ‌మాని పేరు మున్సిపాల్టీల్లో న‌మోదుకు విడిగా మ్యుటేష‌న్‌ను ప్రభుత్వం చేస్తుంది. ఈ బిల్లుతో ఇక‌పై రిజిస్ట్రేష‌న్ జ‌రిగే స‌మ‌యంలోనే మున్సిప‌ల్ రికార్ట్స్‌లో కూడా పేరు మారేలా ప్ర‌భుత్వం ఇంటిగ్రేష‌న్ చేసింది.

రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలోనే మ్యుటేష‌న్ ఫీజు చెల్లించేలా ప్రభుత్వం కొత్త స‌వ‌ర‌ణ‌ల చేసింది. కార్పొరేష‌న్ లు, గ్రేడ్ ల వారీగా మునిసిపాల్టీల్లో మ్యుటేష‌న్‌కు ఏకీకృత ఫీజులు అమ‌లుచేసేలా చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేసినట్టు ప్ర‌భుత్వం పేర్కోంది.

ANN TOP 10