బెంగళూరు: పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్నేత బీఎస్ యడియూరప్పకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై బెంగళూరు కోర్టు గురువారం నాన్బెయిలబుల్అరెస్ట్వారెంట్జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో ప్రభుత్వం జాప్యం చేస్తుందంటూ.. నిందితుడిని అరెస్ట్చేయాలంటూ బాధితురాలి సోదరుడు హైకోర్డును ఆశ్రయించాడు. ఈ విషయంపై విచారణ జరిపిన ఫాస్ట్ట్రాక్కోర్టు, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తన 17 ఏళ్ల కుమార్తెపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు ఆధారంగా సదాశివనగర్పోలీస్స్టేషన్లో యడియూరప్పపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అనంతరం కొద్ది గంటల వ్యవధిలో మార్చి 14న ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అవసరమైతే యడియూరప్పను అరెస్ట్ చేస్తామని గురువారం ఉదయం రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర ప్రకటించారు. ఇప్పటికే కేసు విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు యడియూరప్పకు సమన్లు జారీ చేశారు.
అయితే, ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నందున జూన్ 17న సీఐడీ ముందు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కాగా, 17 ఏళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడినట్లు లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. అయితే, ఈ ఆరోపణలను యడియూరప్ప ఖండించారు. తనపై కేసును కొట్టేయాలని కోర్టును ఆశ్రయించారు.









