కంది శ్రీనివాస రెడ్డి సతీమణి గా పరిచయం
చదువు.. వాక్చాతుర్యం ఉన్న మహిళా శక్తి
కుక్కర్ల పంపిణీతో జనబాహుల్యం లోకి
తెగువ ,ధైర్యం ఉన్న మహిళా నాయకురాలిగా గుర్తింపు
మహిళలకు బాసటగా అనేక కార్యక్రమాలు
అమ్మన్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ నారీలోకానికి ఒక యువ నాయకురాలి రూపంగా అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి నిలుస్తున్నారు.కొన్ని నెలల క్రితం కంది శ్రీనివాస రెడ్డి సతీమణిగా కేవలం అతికొద్ది మందికే పరిచయమున్నఆమె అనతి కాలంలోనే మహిళానాయకురాలిగా తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకున్నారు. చదువులోనే కాదు వాక్చాతుర్యంలోను తన భర్తకు తగిన భార్యగా తనను తాను నిరూపించుకుంది.

రూపకర్త గా..
ముఖ్యంగా కేఎస్ ఆర్ ఫౌండేషన్ తరపున నిర్వహిస్తున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాల రూప కల్పనలో ఆమె పాత్ర అతి ముఖ్యమైంది. ఆది నుండి తన భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తూ తన చాతుర్యంతో ఎన్నో మంచి కార్యక్రమాలను రూపొందించింది.కంది శ్రీనన్న పెళ్లి కానుకలు,ఆంబులెన్స్ లకు కెఎస్ ఆర్ ప్రాణదాతలని నామకరణం చేయడంలో కంది సాయి మౌనాశ్రీనివాసరెడ్డి ప్రత్యేకతను తెలియ చేస్తుంది.ముఖ్యంగా ఆదిలాబాద్ మహిళలకు పోషక విలువలు అందించాలన్న ఆలోచనతో ఉన్న తన భర్త మనసును తెలుసుకుని చాలా మంది పేదలకు ప్రెషర్ కుక్కర్లు లేవన్న విషయం గ్రహించింది. అందులో వండిన ఆహార పదార్ధాలకు అనేక పోషక విలువలు ఉంటాయన్న వాస్తవాన్ని తెలుసుకొని మహిళలకు కంది శ్రీనన్న చిరు కానుకగా ప్రెషర్ కుక్కర్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. అంతేకాదు తన భర్త కంది శ్రీనివాస రెడ్డితో కలిసి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గడపగడపకి కుక్కర్లు చేరడంలో తన వంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించింది.
తన దైన శైలిలో ఎన్నికల ప్రచారంలో..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన భర్త కంది శ్రీనివాస రెడ్డికి మద్దతుగా నియోజకవర్గాన్ని ఆమె చుట్టి వచ్చిన తీరు అభినందనీయం. చక్కటి సరళమైన వాక్చాతుర్యంతో ఆమె జనాలను ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా ఒక మహిళగా సాటి మహిళల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తోటి ఆడవారికి తానున్నానన్న భరోసా కల్పించే విధంగా మాట్లాడి మహిళల గుండెల్లో గూడు కట్టుకున్నారు.అంతే కాదు ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల సమయంలోను రికార్డు స్థాయిలో మండుతున్న ఎండలను లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణ తరపున చేసిన ఇంటింటి ప్రచారం తనలోని స్టామినాని చాటి చెప్పింది.
అబల కాదు సబల
ఎన్నో సమయాలలో సమాజంలో సాటి మహిళల పట్ల జరుగుతున్న దౌర్జన్యాలను ఖండిస్తూనే ఎదురవుతున్న అవమానాలను ధైర్యంగా ఎదుర్కున్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల పోలింగ్ రోజున మహిళలను కించ పర్చేలా వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను ధైర్యంగా నిలదీసి నిగ్గదీసి అడిగిన ధీశాలి కంది సాయి మౌనా శ్రీనివాసరెడ్డి. దీంతో ఆమె చూపిన తెగువ సాటి మహిళలకు ఒక ధైర్యాన్నిచ్చింది. ఆమెలో ఒక వీర నారి కనపడింది.అన్యాయాలు ,అక్రమాలు, అవమానాలు ఎదుర్కొని నిలబడడేలా ఒక తెగింపునిచ్చింది. అందుకే మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందడుగు వేస్తున్నారు.
సరి సమాన బాధ్యతలు
బయట కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు సందర్భాన్ని బట్టి ఎంత హుందా గా వ్యవహరిస్తారో ఇంట్లో కుటుంబ సభ్యులతోని అంతే ప్రేమగా ఉంటారు.ఒక వైపు ఇద్దరు పిల్లల బాధ్యతను సమర్ధవంతంగా నెరవేరుస్తు సమాజం కోసం చంటి పిల్లవాడిని కూడా ఉయ్యాలలో పడుకోబెట్టి కార్యక్రమాలను విజయవంతంగా తీర్చిదిద్దగల నేర్పరి కంది మౌనా శ్రీనివాస రెడ్డి. జన్మదినం సందర్భంగా అమ్మన్యూస్ బృందం శుభాకాంక్షలు చెబుతోంది.









