తిరువనంతపురం: వర్షాకాలం వచ్చేసింది. చిటపట చినుకులు మొదలయ్యాయి. నైరుతీ రుతుపవనాలు(Monsoon) ఇవాళ కేరళలోకి ప్రవేశించాయి. దీంతో ఆ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కేరళతో పాటు ఈశాన్య భారత్‌లోకి కూడా నైరుతీ అడ్వాన్స్ అయినట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది.
కేరళలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కొచ్చితో పాటు ఇతర ప్రాంతాల్లో వరద లాంటి పరిస్థితి నెలకొన్నది. మాన్‌సూన్ రాకతో ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 64.5 ఎంఎం నుంచి 115.5 ఎంఎం మధ్య వర్షపాతం నమోదు అవుతే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.









