AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందరూ చేస్తున్నారు.. నేనూ చేస్తా.. రీ రిలీజ్‌పై ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ఒకప్పుడు తన సినిమాలతో సెన్సేషన్‌ సృష్టించిన డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ (ఆర్జీవీ) ఇప్పుడు తన ట్వీట్స్‌ తో సృష్టిస్తున్నాడు. ప్రతిదీ కొత్తగా ట్రై చేసే ఆర్జీవీ తాజాగా వేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇటీవల పాత సినిమాలు అన్ని రీ రిలీజ్‌ లు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వరకు స్టార్‌ హీరోల సినిమాలు, బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమాలు రీ రిలీజ్‌ చేశారు. రాను రాను ఫ్లాప్‌ సినిమాలు కూడా రీ రిలీజ్‌ చేస్తున్నారు.

ఇటీవల రీ రిలీజ్‌ అయ్యే సినిమాలపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సినిమాలు రీ రిలీజ్‌ ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే అందరూ ఇష్టమొచ్చినట్టు పాత సినిమాలు రీ రిలీజ్‌ చేస్తుండటంతో నేనెందుకు చేయకూడదు అనుకున్నాడో ఏమో ఆర్జీవీ కూడా తన సినిమాని రీ రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించాడు.

ఆర్జీవీ తన మొదటి సినిమా నాగార్జున ‘శివ’తో ఇండస్ట్రీలో భారీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కమర్షియల్‌ హిట్‌ కొట్టడమే కాక సినీ పరిశ్రమలో సాంకేతిక విప్లవం కూడా తీసుకొచ్చాడు ఆర్జీవీ. ఇప్పటికి ఆర్జీవీ గురించి చెప్పాలంటే శివ సినిమా గురించే ఫస్ట్‌ చెబుతారు. అందుకే తన మొదటి సినిమా శివని రీ రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించాడు ఆర్జీవీ.

ANN TOP 10