సికింద్రాబాద్ నుంచి రేపల్లె బయల్దేరిన ఎక్స్‌ప్రెస్ రైలు గుంటూరు బైపాస్ దాటిన తర్వాత నిలిచిపోయింది. రైలు నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పాటు నిప్పు రవ్వలు ఎగసిపడటంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. దాదాపు రెండు గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ఇదే రైలు రాత్రి 10 గంటలకు రేపల్లె నుంచి సికింద్రాబాద్ బయల్దేరాల్సి ఉండటంతో రేపల్లెలో ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.









