నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పోరేషన్‌కు సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు రాలేవని గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడు ఉన్న ప్రోసీజర్ ప్రకారం నిర్ణయాలు తీసుకునే అధికారం బెవరేజ్ కార్పోరేషన్‌కు ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమ ఉత్పత్తుల సరఫరా కోసం సోమ్ డిస్టిలరీస్‌కు బేవరేజ్ కార్పొరేషన్ అమమతి ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. బేవరేజ్ కార్పోరేషన్ రోజువారీ కార్యకలాపాలు తమ దృష్టికి రావని తెలిపారు.









