AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్టీఆర్‌ ఘాట్‌లో జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌ నివాళులు

సీఎం, సీఎం అంటూ తారక్‌ అభిమానుల నినాదాలు
హోరెత్తిన ఎన్టీఆర్‌ ఘాట్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 101వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌లో కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్‌ దగ్గరకు వచ్చి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ సీఎం, సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు.

తారక్, కల్యాణ్‌ రామ్‌ వచ్చిన సమయంలో వారితో ఫొటోస్‌ దిగేందుకు ఫ్యాన్స్‌ ఎగబడ్డారు.. సీఎం, సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. అటు బాలయ్య కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.

ANN TOP 10