AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ పోలింగ్‌.. ఉదయం 10 గంటల వరకు 11 శాతం పోలింగ్‌

‘ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం నుంచి గ్రాడ్యుయేట్స్‌ పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నియోజవర్గం పరిధిలో గ్రాడ్యుయేట్‌లు అయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా ఓటు వేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉదయం 10 గంటల వరకు నల్లగొండ జిల్లాలో 11.34 శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో 11.26 శాతం, మహబూబాబాద్‌ జిల్లాలో 11.01 శాతం, జనగామ జిల్లాలో 10.23 శాతం, ములుగు జిల్లాలో 10.31 శాతం, సూర్యాపేట జిల్లాలో 11.32 శాతం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 7.89 శాతం పోలింగ్‌ నమోదైంది. మిగతా జిల్లాల పోలింగ్‌ వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10