మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి మృతిచెందారు. సోమవారం ఉదయం ఆమె గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. సీతాదేవి ముదినేపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గా 2సార్లు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆమె ఎన్టీఆర్ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సీతాదేవిది సొంతూరు ఏపీలోని కృష్ణా జిల్లా కైకలూరు మండలం కోడూరు.
ముదినేపల్లి నియోజకవర్గం నుంచి సీతాదేవి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. 1985 సంవత్సరం అలాగే 1994 సంవత్సరం లో అసెంబ్లీ ఎన్నికల్లో మద్దినేపల్లి నుంచి సీతాదేవి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటి చేసి, గెలిచారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అనేక రకాల సంస్కరణలను కూడా తీసుకువచ్చారు. అంతేకాకుండా విజయ డైరీ డైరెక్టర్ గా కూడా ఎర్నేని సీతాదేవి పనిచేశారు. ఇక, ఆమె స్వస్థలంలోనే అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. రేపు సీతాదేవి అంతక్రియలు జరగనున్నట్లు సమాచారం. సీతాదేవి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. హైదరాబాద్ లో నేటి (సోమవారం) ఉదయం టిడిపి మాజీ మంత్రి సీతాదేవి గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో సీతాదేవి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.









