AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో మహిళలకు అవార్డులు.. రాహుల్ ప్రశంసలు

ఫ్రాన్స్ వేదిక‌గా జ‌రిగ‌న ప్రతిష్ఠాత్మక 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆట్టహాసంగా జరిగాయి. ఫ్రాన్స్‌ వేదికగా మే 14 నుంచి మొదలైన ఈ ఫెస్టివల్ నిన్నటితో ముగిసింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భార‌తీయ మహిళలు సత్తాచాటారు. ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో మలయాళీ చిత్రం ‘ఆల్‌ వీ ఇమాజైన్‌ యాజ్‌ లైట్‌’ ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకోగా.. టాప్ యాక్టింగ్ అవార్ బెస్ట్ యాక్టరస్ అనసూయ సేన్‌గుప్తా అవార్డును అందుకున్నారు. అది కూడా తొలి సినిమాతోనే. ఈ అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించింది. ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో భార‌తీయ మహిళలు అవార్డు సాధించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. ‘77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన భారతీయ తారలు. ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకున్నందుకు పాయల్ కపాడియా అలాగే ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ టీమ్ మొత్తానికి అభినందనలు. ‘ది షేమ్‌లెస్‌ ’ అనే చిత్రంలో న‌ట‌న‌కు గాను ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ కేటగిరీలో ఉత్తమ న‌టి అవార్డు గెలుచుకున్న అనసూయ సేన్‌గుప్తాకు అభినందనలు. ఈ మహిళలు చరిత్ర లిఖించి మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమకి ఆదర్శంగా నిలుస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ప్రశంసించారు.

ANN TOP 10