బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఖండించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు బుజ్డోజర్ రాజకీయాలు చేస్తున్నారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేతలు ఆదివారం గాంధీ భవన్‌లో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. కొల్లాపూర్, అచ్చంపేటను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని అంటున్నారని మండపడ్డారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, తాను ఐపీఎస్ అధికారిగా పని చేశారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి హత్యపై విచారణ జరుగుతుందని తెలిపారు. హత్య జరిగిన వెంటనే కాంగ్రెస్‌ను తిట్టి పోశారని, పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగినట్లు తెలుస్తోందని మల్లు రవి అనుమానం వ్యక్తం చేశారు.
గువ్వల బాలరాజ్ గూండాగిరికి కేరాఫ్ అడ్రస్: ఎమ్మెల్యే వంశీ కృష్ణ
ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో చేరింది కేసీఆర్ ఆదేశాల మేరకే అని అన్నారు. దారి తప్పిన పోలీసు లెక్క మట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఎస్పీగా ఉన్నప్పుడు పరిటాల రవి హత్య జరిగిందన్నారు. అప్పుడు తన మీద చర్యలు తీసుకుందా అప్పటి ప్రభుత్వం ప్రశ్నించారు. నయీం ఆస్తులపై విచారణ జరపాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన డైరీని బయటపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతామని చెప్పారు. గతంలో కేసీఆర్‌పై యుద్ధం చేస్తానని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కత్తితీశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ గూండాగిరికి కేరాఫ్ అడ్రస్ అంటూ ఆరోపించారు. గువ్వల బాలరాజ్ చిట్లా విప్పుతామని ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పుకొచ్చారు.









