AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కూటమి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు.. మోడీ సెటైర్లు

భారత్‌ను అన్ని రంగాల్లో బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు దేశం కోసం 24×7 పని చేసే మోడీకి, పని లేని ఇండియా కూటమికి మధ్య జరుగుతున్నాయన్నారు. శనివారం బీహార్‌లోని పాటలీపుత్రలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. ఇండియా కూటమి రాత్రి పగలు మోడీని దుర్భాషలాడడంలో బిజీగా ఉందని ఆరోపించారు.

2024 ఎన్నికల్లో ఒకవైపు 24 గంటలు కష్టపడుతున్న మోడీ, మరోవైపు అబద్ధాలు చెప్పే ఇండియా కూటమి ఉందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్ గా మార్చడంలో మోడీ బిజీగా ఉన్నారని, కానీ మోడీని దుర్భాషలాడంలో ఇండియా కూటమి నేతలు బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పైనా మోడీ విమర్శలు గుప్పించారు. ఎల్ఈడీ బల్బుల కాలంలో బిహార్‌లో లాంతరు కూడా ఉండేదని, లాంతర్ ఒక ఇంటిని మాత్రమే వెలిగిస్తుందని అన్నారు. ఇండియా కూటమి 24 గంటలు అబద్ధాలు ప్రచారం చేస్తోందని, వారు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను చూడాల్సి మోడీ ఎద్దేవా చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10