కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించించనున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఈ ఏర్పాట్ల నిర్వహణపై శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌పార్క్ సందర్శించి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారని శాంతికుమారి తెలిపారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమ తమ ఆధీనంలో ఉన్న ఏ ఒక్క అంశంపై అలసత్వం వద్దని సూచించారు. ఆవిర్భావ దినోత్సవాలకు తెలంగాణ ఉద్యమకారులను, మేధావులు, కళాకారులు, అమరుల కుటుంబాలను పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రజలు తీపి కబురు ఉంటుందని ఆశించిన కానీ పలు నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. వేడుకల్లో రాజకీయ లబ్ధి, రాజకీయ ప్రసంగాలు లేకుండా ఆవిర్భావ వేడుకలు ఉండాలని ఆదేశించింది. కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి నిర్ణయాలు, ప్రకటనలు చేయవద్దని ఈసీ ఆదేశించింది.
