ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే అది కూలిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారిక మీడియా వెల్లడించింది. ఆ సమయంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌తోపాటు కాన్వాయ్‌లో మరో రెండు హెలికాప్టర్లు ఉన్నట్లు తెలిపింది.
అధ్యక్షుడితోపాటు విదేశాంగ మంత్రి హోసేన్ అమిరాబ్దోల్లాహియన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, ఇతర అధికారులు ప్రయాణిస్తున్నట్లు చెప్పింది. ఒక స్థానిక అధికారి అది కూలినట్లు పేర్కొనగా.. దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. సహాయక బృందాలు ఘటనాస్థలానికి బయల్దేరాయని, అయితే.. భారీ వర్షం, గాలులతో అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం.









