ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన హామీ ఇచ్చారు. ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వనని, ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నా…. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అనంతరం అవినీతిపరులు వారి పూర్తి జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుంది’’ అని అన్నారు.
రేపు ఐదో దశ పోలింగ్…
కాగా లోక్‌సభ ఎన్నికలు-2024 ఐదవ దశకు సర్వసిద్ధమైంది. రేపు (సోమవారం) ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 49 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ విడత ఉత్తరప్రదేశ్‌లోని 14 లోక్‌సభ, మహారాష్ట్రలో 13, బెంగా ల్‌లో 7, బిహార్, ఒడిశాలో 5, ఝార్ఖండ్ 3 స్థానాలతో పాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో ఒక్కో నియోజక వర్గానికి పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.









