శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు చెందిన శంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీస్‌స్టేషన్ విశ్రాంతి గదిలోనే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్‌రావు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు శ్రీశైలం చేరుకున్న తర్వాత పూర్తివివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
