ఐపీఎల్ 2024 సీజన్ తుది దశకు చేరుకుంటోంది. లీగ్స్ దశలో ఇంకొన్ని మ్యాచ్‌లే మిగిలివున్నాయి. ప్లే ఆప్‌కు చేరుకునేందు అన్ని జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. హైదరాబాద్‌లో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసులను వదులుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు అన్ని రకాలుగా అర్హతలున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే దాని అవకాశాలు మరింత పెరుగుతాయి. అయితే ఇది ఐపీఎల్ కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమన్న అంచనాలు వినపడుతున్నాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్‌కు లీగ్ స్టేజ్‌లో ఇంకో రెండు మ్యాచులు ఉన్నాయి. ఒకటి గుజరాత్ టైటాన్స్, మరొకటి పంజాబ్ కింగ్స్‌తో ఉంది. ఈ రెండు మ్యాచుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో క్వాలిఫయర్-1 ఆడే అవకాశం ఉంది. అలా కాకుండా సన్ రైజర్స్.. మిగిలి రెండు మ్యాచుల్లో ఒక్క దాంట్లో గెలిచినా టాప్-2తో నిలిచే అవకాశం ఉంది. ఇందులో గెలిస్తే హైదరాబాద్ జట్టు నేరుగా ప్లే ఆఫ్ కు వెళ్తనుండగా.. ఒకవేళ ఓడితే ప్లే ఆఫ్ ఆశలు కఠినతరం అవుతాయి.
