AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘మోడీ తప్పుకోవాలి.. రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ది ఒకే మాట’

లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల కీలక పాత్ర పోషిస్తాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో కేసీఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో పోలింగ్ బాగా జరుగుతుందని 60-70 శాతం పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూటమిలో మీరు చేరతారా అని అడగ్గా.. ‘బీజేపీ స్వంత రూల్ ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ఎవరూ ఏ పదవిని చేపట్టరు. కాబట్టి నరేంద్ర మోడీ కూడా తప్పుకోవాలి. దీనిపై బీజేపీ నేతలు ఆలోచన చేయాలి. ఇప్పుడు భారతదేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మేము ఏ కూటమిలో లేమని’ కేసీఆర్ బదులిచ్చారు.

ANN TOP 10