AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెళ్లిపై రాహుల్ గాంధీ ఎమన్నారంటే!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావనపై సరదాగా స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ చిన్నారి మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాహుల్ ఈ ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చారు. బహుశా ఇదే సరైన సమయం ఏమో. త్వరలోనే చేసుకుంటానని ఆయన బదులిచ్చారు. అలాగే గత ఏడాది జైపూర్ మహారాణి కాలేజీ విద్యార్థులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. ఈ సమయంలో ఆయన పెళ్లి గురించి ఓ విద్యార్ధిని ప్రశ్నించింది. మీరు అందంగా ఉంటారు.. చూడటానికి చాలా బాగుంటారు.. అయినా మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగింది. తన పనులు, పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమైనందునే పెళ్లి వైపు ఆలోచన వెళ్లలేదని రాహుల్ గాంధీ అన్నారు. అయితే తాజాగా రాయ్‌బరేలీలో చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తర్వలోనే రాహుల్ గాంధీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

ANN TOP 10