AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు పోతాయి.. కాంగ్రెస్ వస్తే బీసీ గణన చేస్తాం’

ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు పోతాయని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే బీసీ గణన.. పథకాలు వస్తాయని చెప్పారు. సోమవారం మొయినాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని మొన్నటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడితే బీజేపీ నేతల్లో గుబులు పుట్టుకుందన్నారు. అందుకే ఇప్పుడు మాట మార్చి ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో తన ఇంటికి వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆదరించానని అన్నారు. ప్రతీ ఒక్కరి కష్టం తెలుసుకుని, తీర్చటానికి ప్రయత్నించానని చెప్పారు. ఐదేళ్ల నుంచి జనాన్ని పట్టించుకోని బీజేపీ అభ్యర్థి ఇప్పుడు వచ్చి అందరికీ అపాయింట్మెంట్ ఇస్తా అంటున్నారని చెప్పారు. ఇప్పుడు అందరినీ కలుస్తా అంటే ఎవరు నమ్ముతారని వ్యాఖ్యానించారు.

చేవెళ్ల లోక్‌సభ పరిధిలో అందరికీ ఆరు గ్యారెంటీలను అమలు చేయించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ. 500 లకు గ్యాస్ సిలిండర్ వస్తుందని, అలాగే 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు. లోక్ సభ ఎన్నికలు అయిపోయాక మేం ఎక్కడికి వెళ్లమని, ఈ గడ్డ మీదనే ఉంటామని చెప్పారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం మళ్లీ మీ దగ్గరకే వస్తామని తెలిపారు. మీలో ఎవరికైనా ఆరు గ్యారంటీలు అమలు కాకపోతే అప్పుడు అడగండన్నారు. ఆగస్టు 15 లోపు రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసి తీరతామని రంజిత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ANN TOP 10