AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇద్దరు ముద్దుగుమ్మలు.. జోరుగా ప్రమోషన్స్

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4 తెలుగులో ‘బాక్’ పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మే 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘పంచుకో’ పాట అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. రాశిఖన్నా అందాలు ఆరబోసే చిత్రాలు చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. చిత్ర ప్రమోషన్స్ కూడా ధూంధాంగా జరుగుతున్నాయి.

ANN TOP 10