కెఎస్ఆర్ నుదుట తిలకం దిద్ది స్వాగతించిన కాలనీ వాసులు
ఆత్రం సుగుణను ఎంపీగా గెలిపించాలని అభ్యర్ధన
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలుపై వివరణ
కేఎస్ఆర్ వెంట భారీ సంఖ్యలో ముఖ్య నేతలు, కార్యకర్తలు
అమ్మన్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్ : పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ ప్రచారంలో పాల్గొన్నారు. కంది శ్రీనివాస రెడ్డికి కాలనీలో ఘన స్వాగతం లభించింది. మహిళలు ఆయన నుదుట తిలకం దిద్ది స్వాగతించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. గడపగడపకు గ్యారంటీ హామీల కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం చేపట్టారు. అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఆరు గ్యారంటీలను వివరించి కాంగ్రెస్‌కే తమ అమూల్యమైన ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్లు దర్శనాల లక్ష్మణ్, సాయి ప్రణయ్, అంజు, నాయకులు శ్రీలేఖ, జాకీర్, తయిమూర్, అశోక్, బాయిన్‌వార్ గంగారెడ్డి, శ్రీరామ్, కయ్యుం, కుర్ర నరేష్, సంజీవ్‌రెడ్డి, మహిమూద్, బండి దేవిదాస్ చారి, రాజ్ మహమ్మద్, ఉదయ్ కిరణ్, ఓరగంటి అఖిల్, మల్లయ్య, సంతోష్, అంజద్ ఖాన్, రాకేష్ భారీసంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.









