AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘అధిక వడ్డీ’పై కొరడా..!.. ఏకకాలంలో 24 బృందాలుగా తనిఖీలు

సిద్దిపేట: సామాన్యుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీతో వారి నడ్డి విరుస్తున్న ప్రైవేట్‌ ఫైనాన్స్‌లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. జిల్లాలో అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం.. ఫైనాన్స్‌ దందా నడిపిస్తున్న వారిపై శనివారం ఏకకాలంలో దాడులు చేశారు. జిల్లా మొత్తంగా 24 బృందాలుగా ఏర్పడి దాడులు చేయడంతో వడ్డీ, అక్రమ ఫైనాన్స్‌ వ్యాపారులు హడలిపోయారు. కొంతమంది బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు జిల్లాలోని అన్ని పోలీ్‌సస్టేషన్ల వారీగా అనుమతులు లేని ఫైనాన్స్‌, వడ్డీ వ్యాపారుల సమాచారాన్ని ముందే సేకరించారు. తర్వాత ఏకకాలంలో దాడులకు ఉపక్రమించారు.

సిదిపేట జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఫైనాన్స్‌ సంస్థలను ఏర్పాటు చేసి, సామాన్యుల అవసరాలకు డబ్బు అప్పుగా ఇస్తున్నారు. వారి నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇందుకోసం వారి ఆస్తులు.. ఇతరత్రా తనఖా పెట్టుకుంటున్నా.. అవసరాన్ని బట్టీ వడ్డీ రేటు ఉంటుందని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువు, వైద్యం వంటి అవసరాలకు తప్పనిసరిగా అప్పులు చేసి.. అధిక వడ్డీ చెల్లిస్తూ ఆర్థికంగా.. మానసికంగా కుంగిపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు శనివారం సాయ్రంతం ఒక్కసారిగా అలాంటి వ్యాపారాలు చేసే వారిపై దాడులు చేసి వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు, డబ్బులు.. పలువురు కుదువ పెట్టిన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అధిక వడ్డీలు, అనుమతి లేకుండా ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న 38 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ. 1,21,27,120 నగదు, 490 డాక్యుమెంట్లు, 70 తులాల బంగారం, 13 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ANN TOP 10