AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ సీఎం జగన్‌పై రాయితో దాడి.. ఎడమ కంటికి గాయం!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ బస్సు యాత్రలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఆగంతకుడు జగన్‌పై రాయితో దాడికి పాల్పడ్డాడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న జగన్‌.. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలోనే ఓ ఆగంతకుడు జగన్‌పై రాయిని విసిరారు. అత్యంత వేగంగా వచ్చిన రాయి.. జగన్‌ ఎడమ కంటి కనుబొమ్మపై తగిలింది. జగన్‌తో పాటు పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది.

ఏపీ సీఎం జగన్‌కు వైద్యులు వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అయితే జగన్‌పై క్యాట్‌ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రథమ చికిత్స అనంతరం జగన్‌ మళ్లీ బస్సు యాత్ర కొనసాగించారు. కాగా, జగన్‌పై దాడిని వైసీపీ నేతలు ఖండించారు. జగన్‌కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే ఇలాంటి పిరికిపంద చర్యకు దిగాయని ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా వైసీపీ విమర్శించింది. కార్యకర్తలు అందరూ సంయమనంగా ఉండాలని సూచించారు. ఈ దాడిపై రాష్ట్ర ప్రజలందరూ మే 13వ తేదీన సమాధానం చెబుతారని పేర్కొంది.

ANN TOP 10