AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు కీల‌క నిర్ణ‌యం.. తాగునీటి కోసం తెలంగాణ‌కు 8.5 టీఎంసీలు

హైద‌రాబాద్ : కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు త్రిస‌భ్య క‌మిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దాదాపు రెండు గంట‌ల‌కు పైగా జ‌ల‌సౌధ‌లో కొన‌సాగిన త్రిస‌భ్య క‌మిటీ స‌మావేశంలో కేవ‌లం తాగునీటి అంశంపైనే చ‌ర్చించారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తాగునీటి స‌మ‌స్య‌లు రాకుండా.. రెండు రాష్ట్రాల అంగీకారంతో స‌మాన నీటి వాటాల‌ను త్రిస‌భ్య క‌మిటీ పంపిణీ చేసింది.

కేఆర్ఎంబీలో ఉన్న మొత్తం నీటి ల‌భ్యత 14 టీఎంసీలు ఉండ‌గా, ఇందులో తెలంగాణ‌కు 8.5, ఏపీకి 5.5 టీఎంసీల నీటిని కేటాయించారు. మే నెల‌లో మ‌రోసారి తాగునీటి స‌మ‌స్య‌ల‌పై త్రిస‌భ్య క‌మిటీ భేటీ కానుంది. మే నెల‌లో జరిగే సమావేశంలో పులిచింతల కృష్ణా అవసరాల కోసం మరోసారి రివ్యూ చేస్తామ‌న్నారు.

ANN TOP 10