లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు పదవి కాలం ఉండగా.. ఇటీవల ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి గత డిసెంబర్ 9న రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఖాళీ అయిన నాటి నుంచి ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా.. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. ఇక వచ్చే వారం, పది రోజుల్లో షెడ్యూల్ జారీ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఉప ఎన్నిక నిర్వహణ సన్నద్ధతపై ఇప్పటికే రాష్ట్ర అధికారులను నివేదిక కోరింది.









