AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. జీవో ఆధారంగా ఇందుకు సంబంధించి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు.

ఈ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఏప్రిల్ 15న నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలువురు కీలక అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుల నుంచి కీలక సమాచారం సేకరించారు. పలువురిని జైలుకు తరలించారు. కొందరు అధికారులపై సస్పెన్స్ వేటు వేశారు.

ANN TOP 10