AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘దీక్ష గల్లీలో కాదు.. ఢిల్లీలో చేద్దాం’

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పొలాల సందర్శనపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, భూగర్భ జలాలు అడుగంటాయని అన్నారు. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమని చెప్పారు. ప్రాజెక్టులోపై మీరు ఎప్పుడు చర్చకు రమ్మన్న రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. తమరు అధికారం నుండి దిగి నాటికి ఉన్నవి.. ఇప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, నీటి నిల్వలపై చర్చిద్దామని అన్నారు. కరువు కాంగ్రెస్ తెచ్చింది అంటే మీరు అనుభవజ్ఞులు ఇలా అర్థం లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రంలో నీటి లభ్యత, భూగర్భ జలాలు అడిగినటువంటి విషయాలపై కేంద్రంపై ఒత్తిడి తేవడానికి రావాలన్నారు. అలాగే బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడని, రైతుల దగ్గర ముసలి కన్నీరు కారుస్తూ దీక్షలు చేస్తున్నాడని విమర్శించారు. దీక్ష గల్లీలో కాదు.. ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర చేయాలన్నారు. రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు ఇయ్యలేదు మీరు ఎప్పుడు అడగలేదని, మీకు అడిగే ధైర్యం కూడా లేదన్నారు.

కేసీఆర్ ఎలాంటి పర్యటనలో చేసుకోవచ్చని, తమకు ఇబ్బంది లేదన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వానికి సూచనలు చేసే అవకాశాన్ని ఇస్తున్నామని, నియంతృత్వంగా ఎక్కడ వ్యవహారించడం లేదన్నారు. అధికారులు కూడా సహకరిస్తారని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ నేతన్నలపై కాంగ్రెస్ కక్ష కట్టిందని అంటున్నారని, మూడు నెలల్లోనే ఏం కక్ష చేశామని ప్రశ్నించారు. మీరు గతంలో బతుకమ్మ చీరల పెండింగ్‌ డబ్బులు ఇవ్వకనే ఇబ్బంది పడుతున్నారని, అది మీ పాపమేనని మండిపడ్డారు. నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయ చట్రంలో పడకండన్నారు. అన్ని రకాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, పాత బకాయిలు ఉన్నప్పటికీ పెమెంట్స్ చేస్తామన్నారు. గీతన్న, నేతన్న వేరు కాదని, మీకు అండగా ఉక్కు కవచం లా ఉండే బాధ్యత తనదేనన్నారు. మీ కష్టం తన కష్టంగా భావించి అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

ANN TOP 10