AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రంలో లత్కోరోళ్లు రాజ్యమేలుతున్నారు.. కేసీఆర్ ఫైర్

రాష్ట్రంలో లత్కోరోళ్లు రాజ్యమేలుతున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. శుక్రవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పంటలను పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని, ఈ కరువు పాలకుల అసమర్థే కారణమని మండిపడ్డారు. వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని అన్నారు. పరిహారం ఇవ్వకపోతే వాళ్లందరి ఉసురు తగులుతుందన్నారు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, ఇక వాళ్లు తప్పించుకోలేరన్నారు. వీపు విమానం మోత మోగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. నేను జిల్లాల పర్యటనకు వెళ్లగానే అక్కడ నీళ్లు విడుదల చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ పర్యటనకు వెళ్లగానే ఇక్కడ నీటిని విడుదల చేశారన్నారు. ఈ పని ముందే చేసి ఉంటే రైతులకు పంట దక్కేది కదా అని తెలిపారు.

వర్షపాతం తక్కువగా నమోదవుతుందని మంత్రులు మాట్లాడుతున్నది తప్పుడు వాదన అని దుయ్యబట్టారు. ఇప్పటికీ పూర్తి స్థాయి రైతు బంధు ఇవ్వలేన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంటలు ఎండని జిల్లా లేనేలేదన్నారు. క్వాలిటీ కరెంట్ ఇవ్వక.. రైతు బంధు ఇవ్వక.. కాలం గడిపేస్తున్నారని కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభంలో పడిందన్నారు. ఈ సంక్షోభానికి జవాబుదారీ ఎవరని ప్రశ్నించారు. పాత తెలంగాణ మళ్లీ పునరావృతం అయ్యిందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే పంటలు ఎండి పోతున్నారన్నారు. అన్ని పంటలు కొనాల్సిందే.. బోనస్ కూడా ఇవ్వాల్సేందేన్నారు. ఇప్పటికి పూర్తి స్తాయిలో రైతు బంధు ఇవ్వాలేదని, కాళ్యాణ లక్ష్మీకి తులం బంగారం కలిపి ఇస్తామన్నారు.. అది ఏమైందని నిలదీశారు. తులం బంగారం రాని వాళ్ళు తరిమికొడుతారని వ్యాఖ్యలు చేశారు. రూ. 4 వేల పింఛన్ ఇంట్లో ఇద్దరికి ఇస్తామన్నారు ఏమైందని కేసీఆర్ అన్నారు.

ANN TOP 10