AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శీనన్న అందరికీ అండ: పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఖమ్మం రూరల్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శీనన్న ప్రజలందరికీ అండగా ఉంటారని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయి గణేష్ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో నాయకులు, స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి శ్రీనన్న కు చెప్పొచ్చని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సాయి గణేష్ నగర్ అభివృద్ధి కమిటీ బాధ్యులు ప్రసాద్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. శీనన్న దృష్టికి తీసుకెళ్లి తాగునీటి సమస్య లేకుండా చూద్దామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ANN TOP 10